Gorantla Madhav: పోలీసులు సహకరించడం వల్లే తప్పించుకుంటున్నానన్నది అవాస్తవం: ఎంపీ గోరంట్ల మాధవ్

  • హైదరాబాదు నుంచి అనంతపురం బయల్దేరిన మాధవ్
  • కర్నూలు జిల్లాలో కురుబ సంఘం నేతల ఘనస్వాగతం
  • మీడియా పోలీసు డ్యూటీ చేయడం మానుకోవాలని హితవు
  • పాత మాధవ్ ను చూస్తారంటూ వార్నింగ్
MP Gorantla Madhav talks to media

హైదరాబాదు నుంచి అనంతపురం బయల్దేరిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు కర్నూలు జిల్లాలో ఘనస్వాగతం లభించింది. జిల్లా సరిహద్దులోని ఓ టోల్ గేట్ వద్ద కురుబ సంఘం నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు సహకరించడం వల్లే తాను తప్పించుకుంటున్నానన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ తానొక్కడి కోసమే ఏర్పడలేదని, పోలీసు వ్యవస్థ బ్రిటీష్ కాలం నుంచే ఉందని అన్నారు. వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారని, మీడియా పోలీసు డ్యూటీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పోలీసులు తమ విధులు నిర్వర్తించుకునే విధంగా మీడియా మసలుకోవాలని అన్నారు. 

తనపై తప్పుడు ప్రచారం చేస్తే పాత గోరంట్ల మాధవ్ ను చూడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వీడియోను తన వీడియోగా చూపించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. తనపై ప్రచారంలో ఉన్న వీడియోను అమెరికా ల్యాబ్ కు పంపిన టీడీపీ నేతలు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాటలను కూడా అమెరికా ల్యాబ్ కు ఎందుకు పంపరని ప్రశ్నించారు.

More Telugu News