India Today: 8 నెలల్లో 17 శాతం ప్ర‌జాదర‌ణ‌ను పెంచుకున్న జగన్... మూడ్ ఆఫ్ ద నేష‌న్ స‌ర్వే వెల్ల‌డి

  • ఇండియా టుడే చేప‌ట్టిన స‌ర్వే ఫ‌లితాల వెల్ల‌డి
  • జ‌గ‌న్ జ‌నాద‌ర‌ణ 57 శాతానికి పెరిగింద‌న్న స‌ర్వే
  • ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైసీపీకి 18 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డి
  • జ‌నాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో జ‌గ‌న్‌ ఐదో స్థానంలో నిలిచార‌న్న స‌ర్వే
ys jagan popularity grows 17 percent in just 8 months

'మూడ్ ఆఫ్ ద నేష‌న్' పేరిట ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన తాజా స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ స‌ర్వేలో ఏపీలో మ‌రోమారు వైసీపీదే విజ‌య‌మ‌ని తేలింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో వైసీపీ 18 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని ఆ స‌ర్వే పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలోనూ వైసీపీకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని కూడా చెప్పింది.

ఇక ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప‌ట్ల ఆద‌ర‌ణ మ‌రింత‌గా పెరిగింద‌ని ఆ స‌ర్వే తెలిపింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిపిన స‌ర్వేలో జ‌గ‌న్‌కు 40 శాతం జ‌నాద‌ర‌ణ క‌నిపించ‌గా... తాజాగా ఈ నెల‌లో చేప‌ట్టిన స‌ర్వేలో అది ఏకంగా 17 శాతం పెరిగి 57 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా దేశంలోని అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో జ‌గ‌న్ ఐదో స్థానంలో నిలిచిన‌ట్లు ఆ స‌ర్వే వెల్ల‌డించింది.

More Telugu News