Motorola: 200 మెగాపిక్సల్ కెమెరాతో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్

  • మోటో ఎక్స్ 30 ప్రోని చైనాలో విడుదల చేసిన మోటరోలా
  • మూడు వేరియంట్లలో లభ్యం
  • రూ.43,999 నుంచి ధరలు ప్రారంభం
Motorola has finally unveiled worlds first phone with 200 megapixel camera

ఎన్నో నెలల ఉత్కంఠ తర్వాత ప్రపంచంలో తొలి 200 మెగా పిక్సల్ కెమెరాతో కూడిన మోటరోలా ఎక్స్30 ప్రో ఫోన్ ను మోటరోలా ఆవిష్కరించింది. అలాగే మోటో రేజ్ఆర్ 2022ని కూడా చైనా మార్కెట్లో విడుదల చేసింది. 

మోటరోలా మోటో ఎక్స్ 30 ప్రోలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ ప్యానెల్ డిస్ ప్లే ఉంటుంది. 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్ తో వస్తుంది. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో రావడం విశేషం. ఈ ఫోన్ లో ఉన్న మరో ఆకర్షణీయ అంశం 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్. 

వెనుక భాగంలో శామ్ సంగ్ ఐఎస్ వో సెల్ హెచ్ పీ1 కెమెరా ఉంటుంది. వీటి ధరలను పరిశీలిస్తే.. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో కూడిన మోటో ఎక్స్ 30 ప్రో ఫోన్ ధర 3.688 యువాన్లు. మన కరెన్సీలో రూ.43,999. 12జీబీ, 256జీబీ, 12జీబీ, 512జీబీ వేరియంట్లు కూడా ఉన్నాయి. మోటో రేజ్ఆర్ 2022 క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జనరేషన్1 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇందులో 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది.

More Telugu News