Vijay: విశాఖలో విజయ్ 'వారసుడు' షూటింగ్

  • తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం 
  • 'మహర్షి' తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న సినిమా 
  • మరో వారం పాటు విశాఖలోనే షూటింగ్ 
  • సంక్రాంతికి విడుదల చేసే అవకాశం
Varasudu Movie Update

విజయ్ హీరోగా 'వారసుడు' సినిమా రూపొందుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమిళంలో ఈ సినిమాకి 'వరిసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.   

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగు గత కొన్ని రోజులుగా వైజాగ్ లో జరుగుతోంది. విజయ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది.

 ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే 'సంక్రాంతి'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ తరువాత వంశీ పైడిపల్లి నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

More Telugu News