health experts: 30 దాటితే.. మహిళలను చుట్టుముట్టే సమస్యలు!

  • గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయి
  • రుతుచక్రంలో మార్పులు
  • బరువు పెరిగిపోవడంతో ఇబ్బందులు
  • జుట్టు రాలిపోవడం, శ్వాసకోస సమస్యలు
  • వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి
health experts on signs of health troubles in women post 30 years

పురుషులతో పోలిస్తే మహిళల ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత వారిని ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. వీటికి ఆదిలోనే చికిత్స తీసుకోవడం వల్ల వారు పూర్తి ఆరోగ్యంతో లైఫ్ ను లీడ్ చేయవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన స్త్రీలు ఏడాదికోసారి అయినా సమగ్రంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.


బరువు
వివాహం, పిల్లలు కలిగిన తర్వాత మహిళల్లో ఎక్కువ మంది బరువు పెరిగిపోతుంటారు. ముఖ్యంగా నడుము చుట్టు కొలత పెద్దదిగా మారుతుంది. ఈ సమస్య నుంచి వెంటనే బయటకు వచ్చేలా జాగ్రత్త పడాలి. లేదంటే బరువు, కొవ్వు కారణంగా తర్వాత మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు పెరిగిపోయారంటే జీవక్రియలు ఇంతకుముందు మాదిరిగా సాఫీగా సాగడం లేదని అర్థం చేసుకోవాలి. లేదంటే హార్మోన్లలో అసమతుల్యత వచ్చి ఉండొచ్చు. అందుకని కారణాన్ని గుర్తించి నివారణ చర్యలను అమలు చేయాలి.

జుట్టు రాలిపోవడం
శరీరానికి కావాల్సిన పోషకాహారం తీసుకోవడం లేదన్న దానికి నిదర్శమనే జట్టు రాలిపోవడం. అందుకని తీసుకునే ఆహరాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఆహారం, పోషకాల పరంగా ఎటువంటి లోపం లేకపోతే, అప్పుడు హార్మోన్లలో అసమతుల్యత లేదంటే ఒత్తిళ్లు కారణమై ఉంటాయి. 

గర్భధారణ
కొందరు పెళ్లయిన ఐదేళ్లకు కూడా గర్భం రాలేదని బాధపడిపోతుంటారు. అయితే ఏ వయసులో వివాహం చేసుకున్నారనేది ఇక్కడ కీలకం అవుతుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత నుంచి మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గుతుంటాయి. గర్భం వచ్చినా ఎన్నో సమస్యల రిస్క్ ఉంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాలిస్తే రక్తపోటు, మధుమేహం రిస్క్ పెరుగుతుంది. 

రుతుచక్రం అస్తవ్యస్తం 
30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎండో మెట్రియోసిస్ లేదా యుటెరిన్ ఫైబ్రాయిడ్లు ఏర్పడొచ్చు. ఇవి రుతుచక్ర తీరును మార్చేస్తాయి. హార్మోన్లలో మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి.

శ్వాసకోస సమస్యలు
35 ఏళ్ల తర్వాత సహజంగా ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత సన్నగిల్లుతుంది. ఇది కొంత మందిలో సమస్యలకు దారితీయవచ్చు. దీనికి శ్వాసకోసానికి బలాన్నిచ్చే వ్యాయామాలు చేయాలి. ఇలాంటి సమస్యల్లో ఏవి కనిపించినా ఒకసారి వైద్య నిపుణుల సూచనలు తీసుకోవాలి.

More Telugu News