Team India: ఆసియా కప్ కు టీమిండియా ఎంపిక... మళ్లీ జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ

  • ఆగస్టు 27 నుంచి ఆసియా కప్
  • యూఏఈ వేదికగా మ్యాచ్ లు
  • రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనున్న టీమిండియా 
  • కేఎల్ రాహుల్ పునరాగమనం
Team India announced for Asia Cup

యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియాను నేడు ఎంపిక చేశారు. జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇటీవల వెస్టిండీస్ తో సిరీస్ కు సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక, జట్టులో కొత్త ముఖాలకు స్థానం కల్పించలేదు. ప్రధానంగా, టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఆసియా కప్ లో ఆడే భారత జట్టు ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.


కాగా, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లను గాయాల కారణంగా పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారని పేర్కొంది. ఇక, ఆసియా కప్ కోసం శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ స్టాండ్ బై ఆటగాళ్లుగా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. ఆసియా కప్ పోటీలు ఆగస్టు 27 నుంచి జరగనున్నాయి.


More Telugu News