Sajjala Ramakrishna Reddy: మాధవ్ వ్యవహారంలో సజ్జల వ్యాఖ్యలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు

  • ఎంపీ మాధవ్ వీడియో కాల్ రగడ
  • ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న సజ్జల
  • ఇతడు మహారోతలా ఉన్నాడంటూ అనిత వ్యాఖ్యలు
  • ఫిర్యాదు చేస్తేనే న్యాయం చేస్తారా అంటూ బుద్ధా ఆగ్రహం
TDP leaders fires on Sajjala in Gorantla Madhav row

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాలింగ్ వ్యవహారంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఏ మహిళ అయినా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సజ్జల అన్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తేనే మహిళలకు న్యాయం చేస్తాం అనడం దారుణమని విమర్శించారు. బుల్లెట్ కంటే ముందొస్తాడు అంటూ ఎలివేషన్లు ఎందుకు? అంటూ ఎత్తిపొడిచారు. మహిళల్ని దగా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ బుద్ధా ట్వీట్ చేశారు. సజ్జల వ్యాఖ్యల క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.

టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంట, అరగంట అశ్లీల వీడియోలు బయటికి వచ్చాయని, అవి నిజం అని అందరికీ తెలుసని పేర్కొన్నారు. "అయితే, ఆ వీడియోలు తమవి కాదని వాళ్లే చెప్పారంట... అందుకే అవి వారివి కాదు అని ఇతగాడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. వాళ్లు రోత అయితే ఇతడు మహారోతలా ఉన్నాడు. మొత్తానికి డర్టీ ఎంపీ మాధవ్ పై చర్యలేమీ ఉండవు అని పరోక్షంగా చెప్పేశారు" అంటూ అనిత ధ్వజమెత్తారు.

More Telugu News