Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ, ఆ వీడియోను ఏ ల్యాబ్ కు పంపారు?: వర్ల రామయ్య

  • సంచలనం రేపిన గోరంట్ల మాధవ్ వీడియో కాల్
  • వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శనాస్త్రాలు
  • వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవన్న సజ్జల
  • ప్రశ్నల వర్షం కురిపించిన వర్ల రామయ్య
Varla Ramaiah questions CM Jagan over Gorantla Madhav video issue

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వీడియో నేపథ్యంలో వైసీపీ నాయకత్వంపై టీడీపీ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ అంశంపై తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. 

"ముఖ్యమంత్రి గారూ... ఎంపీ మాధవ్ బూతు పురాణం ఘటనలో ఆ బూతు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని సజ్జల చెబుతున్నారు. అయితే ఆ వీడియోను ఏ ల్యాబ్ కు పంపారు? ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఏ అధికారి పంపారు? ఏఏ సెక్షన్ లతో కేసు నమోదు చేశారు? అసలు ఆ బూతు వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరిందా, లేదా? చేరితే... ఎప్పుడు చేరింది?" అంటూ వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. 

అంతకుముందు, ఈ వీడియో ఉదంతంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, వీడియో నిజమని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇతరులకు గుణపాఠంలా ఈ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

అటు, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.

More Telugu News