Muslim students: రాష్ట్ర స్థాయిలో ‘రామాయణం’పై క్విజ్.. మొదటి రెండు స్థానాల్లో ముస్లిం విద్యార్థులు

  • కేరళలో చోటు చేసుకున్న అరుదైన సందర్భం
  • కేకేహెచ్ఎం ఇస్లామిక్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
  • వఫీ కోర్సులో భాగంగా ఇతర మతాల గురించి అధ్యయనం
Two Muslim students win online quiz on Ramayana

రామాయణం గురించి హిందువులకే బాగా తెలుస్తుందన్న అభిప్రాయాన్ని ఓ ఇద్దరు ముస్లిం విద్యార్థులు మార్చేశారు. కేరళలో రాష్ట్రవ్యాప్తంగా రామాయణంపై నిర్వహించిన క్విజ్ లో మొదటి, ద్వితీయ స్థానాల్లో ఇద్దరు ముస్లిం విద్యార్థులు నిలిచి చరిత్ర సృష్టించారు. వారి పేర్లు జబీర్ పీకే, మహ్మద్ బాసిత్. ఈ క్విజ్ లో రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది పాల్గొన్నారు.

వాలాన్ చెరీలోని కేకేహెచ్ఎం ఇస్లామిక్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో వీరు వఫీ కోర్స్ చేస్తున్నారు. ఈ కోర్సు ఎనిమిదేళ్ల కాల వ్యవధితో ఉంటుంది. వినూత్నమైన సిలబస్ ఇందులో భాగం. భారత్ లోని వివిధ మతాల గురించి అంశాలు కూడా ఉంటాయి. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిక్కిజంపై బోధనలు ఉంటాయి. అంటే అన్ని మతాల గురించి వారికి వివరంగా చెబుతారు. దీని ఫలితమే వారు తమ మతానికి సంబంధించినది కాకపోయినా రామాయణం గురించి ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానంతో ప్రతిభ చూపించారు.

More Telugu News