Nithin: కృతి శెట్టిని ఆటపట్టించిన వెన్నెల కిశోర్ !

  • నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజకవర్గం'
  • కథానాయికలుగా కృతి శెట్టి .. కేథరిన్ 
  • కితకితలు పెట్టే 'గురు' పాత్రను పోషించిన వెన్నెల కిశోర్ 
  • అంజలి ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
Macharla Niyojakavargam movie team interview

నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో, కృతి శెట్టి - కేథరిన్ కథానాయికలుగా అలరించనున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. 

ఈ సినిమాలో విపరితమైన ఇగో ఉన్న  'గురు' అనే పాత్రలో వెన్నెల కిశోర్  సందడి చేయనున్నాడు. తాజా ఇంటర్వ్యూలోను ఆయన సరదాగా తన ఇగో చూపించాడు. 'ఫర్లేదు  ఈ మధ్య డాన్సులు బాగానే చేస్తున్నావ్' అంటూ నితిన్ నీ, ఇంటర్వ్యూకి ఆలస్యంగా వచ్చావంటూ కృతి శెట్టిని ఆటపట్టించాడు. 

పనిలో పనిగా యాంకర్ శ్యామలపై కూడా చిటపటలాడాడు. నిర్మాత తనకి ఇవ్వాల్సిన ఎమౌంట్ లో కొంత బ్యాలెన్స్ ఉందనీ, అది క్లియర్ చేస్తేనే ఆ పాత్రలో నుంచి తాను బయటికి వస్తానని అన్నాడు. తనతో ఫస్టు డబ్బింగ్ చెప్పించి ఆ తరువాతనే యాక్టింగ్ చేయించారు అంటూ అల్లరి చేశాడు. రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, అంజలి ఐటమ్ సాంగ్ లో మెరిసింది.

More Telugu News