Congress: ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు.. బారికేడ్ దూకేసిన ప్రియాంకా గాంధీ... వీడియో ఇదిగో

  • ఈడీ విచార‌ణ‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌లు
  • న‌లుపు రంగు దుస్తుల‌తో ఢిల్లీ రోడ్లెక్కిన కాంగ్రెస్ నేత‌లు
  • బారికేడ్‌ను ఎక్కి దానిపై నుంచి దూకిన ప్రియాంకా గాంధీ
congress leader priyanka gandhi jumps police barricade in delhi

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు పేరిట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వంపై కొన‌సాగిస్తున్న విచార‌ణ ప‌ర్వాన్ని నిర‌సిస్తూ శుక్ర‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగాయి. పార్టీకి చెందిన నేత‌లంతా నిర‌స‌న‌కారులుగా నలుపు రంగు దుస్తులేసుకుని మ‌రీ రోడ్ల‌పైకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. 

ఈ ఆందోళ‌న‌ల్లో భాగంగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. కాంగ్రెస్ నిర‌స‌న‌ల్లో భాగంగా పార్టీకి చెందిన అంద‌రు నేత‌ల మాదిరే న‌లుపు రంగు దుస్తులేసుకుని రోడ్డు మీద‌కు వ‌చ్చిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ శ్రేణుల‌ను ముందుండి న‌డిపించారు. 

ఈ సంద‌ర్భంగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్‌ లను ఏర్పాటు చేశారు. అడుగు ముందుకేయ‌డానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన‌ బారికేడ్‌ను సైతం లెక్క‌చేయ‌ని ప్రియాంక‌... అవ‌లీల‌గా బారికేడ్‌ను ఎక్కి దానిపై నుంచి దూకారు. కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

More Telugu News