Congress: ఈడీ విచార‌ణ‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖ‌ర్గే

  • నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ల‌ను విచారించిన ఈడీ
  • యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని సీజ్ చేసిన ద‌ర్యాప్తు సంస్థ‌
  • నాలుగున్న‌ర గంట‌లుగా ఖ‌ర్గేను విచారిస్తున్నార‌న్న జైరామ్‌
ed interrogating congress mp Mallikarjun Kharge

కాంగ్రెస్ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్‌కు చెందిన ఆస్తుల వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీల‌ను రోజుల త‌ర‌బ‌డి విచారించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో భాగంగా మంగ‌ళ‌, బుధ వారాల్లో నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక కార్యాల‌యాల్లో సోదాలు చేసిన ఈడీ... ఆ కార్యాల‌యంలోనే ఉన్న యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని నిన్న సీజ్ చేసింది.

తాజాగా గురువారం కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గేను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. గ‌డ‌చిన నాలుగున్న‌ర గంట‌లుగా ఖ‌ర్గేను ఈడీ అధికారులు విచారిస్తున్నార‌ని పార్టీ ఎంపీ జైరామ్ ర‌మేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. 

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద‌ర్యాప్తు, యంగ్ ఇండియా కార్యాల‌యం సీజ్ త‌దిత‌రాల‌పై పార్టీ కీల‌క నేత‌ల‌తో జ‌రిగిన భేటీలో ఖ‌ర్గే కూడా పాలుపంచుకున్నారు. ఆ త‌ర్వాతే ఆయ‌న‌ను ఈడీ అధికారులు విచార‌ణ‌కు తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.  

More Telugu News