Arpita Mukherjee: నాలుగు బ్యూటీ పార్లర్లను నిర్వహిస్తున్న అర్పితా ముఖర్జీ

  • బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ
  • అర్పిత ఫ్లాట్లలో రూ. 52 కోట్ల నగదు స్వాధీనం
  • బ్యూటీ పార్లర్లు నిర్వహించే అర్పితకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయనే కోణంలో ఈడీ దర్యాప్తు
Arpita Mukherjee has 4 beauty parlours

పశ్చిమ బెంగాల్ లో వెలుగులోకి వచ్చిన టీచర్ల రిక్రూట్ మెంట్ స్కామ్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ స్కాం సూత్రధారి, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ ఫ్లాట్లలో రూ. 52 కోట్ల నగదును ఈడీ స్వాథీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ రోజుతో అర్పితకు 10 రోజుల కస్టడీ ముగియనుంది. దీంతో ఆమెను పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. 

మరోవైపు ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. పార్థ ఛటర్జీతో అర్పితకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. పార్థ ఛటర్జీకి ఒక పారిశ్రామికవేత్త బహుమతిగా ఇచ్చిన ఫ్లాట్ లో అర్పిత ఉంటోంది. అర్పితకు చెందిన ఒక ఫ్లాట్ ను నిన్ననే ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

మరోవైపు టచ్ పేరుతో అర్పితకు బ్యాటీ పార్లర్లు ఉన్నాయి. కోల్ కతాలోని పాటులీ టౌన్ షిప్, బారాంగే, లేక్ వ్యూ రోడ్ ప్రాంతాల్లో ఒక బ్యూటీ పార్లర్, మూడు నెయిల్ సెలూన్లు ఉన్నాయని ఈడీ విచారణలో తేలింది. ఈ బ్యూటీ పార్లర్లపై ఈడీ అధికారులు రెయిడ్ చేశారు. బ్యూటీ పార్లర్లు నడుపుతున్న అర్పితకు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనే కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

More Telugu News