India: కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక స్వర్ణం గెలిచిన భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు

  • ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం
  • అద్భుత ప్రతిభ కనబర్చిన భారత మహిళలు
  • కామన్వెల్త్ క్రీడల లాన్ బౌల్స్ ఈవెంట్లో భారత్ కు ఇదే తొలి స్వర్ణం
  • నాలుగుకి పెరిగిన భారత్ స్వర్ణాలు
Indian eves wins historical gold in Commonwealth Games Lawn Bowls event

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పసిడి ప్రస్థానం కొనసాగుతోంది. తాజాగా మహిళల లాన్ బౌల్స్ ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్లో నలుగురు సభ్యుల భారత మహిళల జట్టు 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించింది. 

కామన్వెల్త్ క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటివరకు లాన్ బౌల్స్ ఈవెంట్లో స్వర్ణం గెలవలేదు. ఈ నేపథ్యంలో, నేడు గెలిచిన పసిడి పతకం చారిత్రాత్మకంగా మారింది. లాన్ బౌల్స్ ఈవెంట్లో ప్రథమస్థానంలో నిలిచిన భారత జట్టుకు రూపా రాణి టిర్కీ కెప్టెన్ కాగా, లవ్లీ చౌబే, పింకీ, నయన్ మోనీ సైకీ ఇతర సభ్యులు. తాజా పతకంతో బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 4కి చేరింది.

More Telugu News