Pakistan: కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. ఆరుగురు సీనియర్ ఆర్మీ అధికారుల దుర్మరణం?

  • బలూచిస్థాన్‌లో వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న హెలికాప్టర్
  • కార్ప్స్ కమాండర్ సహా ఆరుగురు మృతి చెందినట్టు అనుమానం
  • హెలికాప్టర్ అదృశ్యమైనట్టు నిర్ధారించిన ఆర్మీ
  • కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్స్
Chopper with 6 Pak army officials crashes in Balochistan

పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఆర్మీ సీనియర్ అధికారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. హెలికాప్టర్ అదృశ్యమైనప్పుడు బలూచిస్థాన్‌లోని లాస్‌బెలాలో వరద సహాయక కార్యక్రమాల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందులో కార్ప్స్ కమాండర్ 12 (క్వెట్టా) సహా ఆరుగురు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బలూచిస్థాన్‌లోని విందర్ మరియు సాస్సీ పున్ను మందిరం మధ్య హెలికాప్టర్ కూలి వుంటుందని అధికారులు భావిస్తున్నారు. 

హెలికాప్టర్ అదృశ్యమైందని నిర్ధారించిన అధికారులు.. కూలిపోయిందన్న వార్తలను మాత్రం నిర్ధారించడం లేదు. ఘటనా ప్రదేశానికి అధికారులు బయలుదేరారు. బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో వరద సహాయక చర్యల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ ఏటీసీ (ATC)తో సంబంధాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ ఓ ట్వీట్‌లో తెలిపింది. వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమాండర్ సహా ఆరుగురు వ్యక్తులు అందులో ఉన్నట్టు పేర్కొంది. సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్టు తెలిపింది.

More Telugu News