Kalima: విద్యార్థులతో 'కలీమా' పఠనం చేయించారని పాఠశాలను గంగాజలంతో శుద్ధి చేసిన బీజేపీ నేతలు

  • కాన్పూర్ నగరంలోని స్కూలులో ఘటన
  • ఉదయం ప్రార్థన సందర్భంగా కలీమా పఠనం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
  • ఆందోళనకు దిగిన భజరంగ్ దళ్, బీజేపీ వర్గాలు
  • ఇక తమ స్కూల్లో ప్రార్థనలు ఉండవన్న యాజమాన్యం
Hindu organizatioins and BJP Kanpur wing purifies a school with Gangajal after Kalima taught in a school

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థులతో కలీమా (ఇస్లామిక్ పవిత్ర ప్రవచనం) పఠనం చేయించారంటూ హిందుత్వ సంఘాలు, నగర బీజేపీ శాఖ గంగాజలంతో ఆ స్కూల్ ను శుద్ధి చేశాయి. గంగాజలం తెచ్చి ఆ స్కూల్లోని అన్ని గదుల్లోనూ, ప్రాంగణంలోనూ చల్లారు. విద్యార్థుల తల్లిదండ్రులు, భజరంగ్ దళ్ వంటి హిందుత్వ సంస్థల ఆగ్రహంతో అధికారులు, పోలీసులు ఆ స్కూల్ వద్దకు తరలివచ్చారు. 

దీనిపై స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, స్కూలు డైరీ ప్రకారం ప్రతి మతానికి చెందిన ప్రార్థనలను ప్రతి విద్యార్థి పఠించాల్సి ఉంటుందని వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా తమ స్కూల్లో ఈ విధానం అమల్లో ఉందని తెలిపారు. అయితే, ఇస్లామిక్ కలీమాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో, ఇకమీదట తమ పాఠశాలలో ప్రార్థనలు జరుపబోమని స్కూలు యాజమాన్యం హామీ ఇచ్చింది. 

స్కూళ్లలో ప్రార్థనలు చేయించడం మమూలేనని, కానీ ఇలా ఇస్లామిక్ కలీమా బోధించడం ఎక్కడా చూడలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కాగా, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటిదాకా ఎవరూ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

More Telugu News