Nikhil: 'కార్తికేయ 2'లో స్వాతి ఉన్నట్టా .. లేనట్టా?!

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'కార్తికేయ 2'
  • నిఖిల్ జోడీగా నటించిన అనుపమ పరమేశ్వరన్
  • కీలకమైన పాత్రలో అనుపమ్ ఖేర్ 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
Karthikeya 2 movie update

నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదటిభాగంలో నటించిన స్వాతి .. సీక్వెల్ లోను చేస్తోందనే ఒక టాక్ ఆ మధ్య వచ్చింది. అలాగే ఈ కథ మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుందా? లేదంటే దానితో ఎలాంటి సంబంధం లేకుండా కొనసాగుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రావడంతో నిఖిల్ స్పందించాడు. 

"ఫస్టు పార్టులో హీరో మెడికల్ డిగ్రీ తీసుకోవడంతో కథ ముగుస్తుంది. ఆ తరువాత ఆయన ఒక ఆసుపత్రిలో పనిచేస్తుండగా సెకండ్ పార్టు మొదలవుతుంది. మొదటి పార్టులో హీరోయిన్ గా చేసిన స్వాతి పాత్ర కూడా ఈ కథలో భాగంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆమె ఉందా .. లేదా? అనేది మాత్రం సస్పెన్స్" అని చెప్పాడు. అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News