india: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

  • 24 గంటల్లో 16, 464 కేసుల నమోదు
  • వైరస్ తో తాజాగా 24 మంది మృతి
  • ప్రస్తుతం 1,43,989 క్రియాశీల కేసులు 
India reports 16464 new cases

భారత్ లో కరోనా వ్యాప్తి  తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. మొన్న 19 వేల పైచిలుకు కేసులు నమోదవగా.. తాజాగా మూడు వేలు తగ్గాయి. దేశంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 4,40,36,275కి చేరుకుంది. రోజువారీ మరణాల సంఖ్య కూడా తగ్గింది. మొన్న 39 మంది  మృతి చెందగా.. తాజాగా 24 మంది వైరస్ వల్ల మరణించారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,26, 396కి చేరుకుంది.  
 
గత 24 గంటల్లో 16,112 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో, ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4, 33, 65, 890కి చేరుకుంది. కాగా, ప్రస్తుతం దేశంలో 1,43,989 క్రియాశీల కేసులు ఉన్నాయి.క్రియాశీల రేటు 0.33 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు 2,04,34,03,676 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,34,167 మందికి వ్యాక్సిన్ అందజేశారు.

More Telugu News