Bars: కృష్ణా జిల్లాలో బార్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ద్వారా రూ.30.07 కోట్ల ఆదాయం

  • ఏపీలో బార్లకు అనుమతుల కోసం ఈ-టెండర్లు
  • కృష్ణా జిల్లాలో 37 బార్లకు ఈ-టెండర్లు
  • 59 బిడ్లు దాఖలు
  • దరఖాస్తు రుసుం రూపంలో రూ.4.10 కోట్లు
  • బిడ్డింగ్ రూపంలో రూ.25.97
Huge revenue in tenders for bars licences in Krishna District

ఏపీలో బార్లకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ-టెండర్లు నిర్వహిస్తుండడం తెలిసిందే. తాజాగా, కృష్ణా జిల్లాలో బార్లకు నిర్వహించిన ఈ-టెండర్లలో రూ.30.07 కోట్ల మేర భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో మొత్తం 37 బార్లకు ఎక్సైజ్ శాఖ ఈ-టెండర్లు పిలిచింది. 59 బిడ్లు దాఖలవగా, దరఖాస్తు రుసుం రూపంలో రూ.4.10 కోట్లు, బిడ్డింగ్ ద్వారా రూ.25.97 కోట్లు వచ్చాయి.  

అత్యధికంగా తాడిగడప మున్సిపల్ పరిధిలో 7 బార్లకు రూ.97 లక్షలు చొప్పున బిడ్లు దాఖలయ్యాయి. అవనిగడ్డలోని ఓ బార్ కు అత్యల్పంగా రూ.25 లక్షల బిడ్ దాఖలైంది.

More Telugu News