Mega Millions jackpot: అదృష్టమంటే ఇదే మరి!.. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లు గెల్చుకున్న అదృష్టవంతుడు!

  • రెండు డాలర్లు పెట్టి టికెట్ కొన్న వ్యక్తి
  • తాజా డ్రాలో 1.28 బిలియన్ డాలర్ల జాక్‌పాట్
  • అమెరికా చరిత్రలోనే మూడో అతిపెద్ద జాక్‌పాట్
someone won Rs 10 thousand crore in Mega Millions jackpot

అదృష్టం ఎప్పుడు.. ఏవైపు నుంచి వస్తుందో ఊహించలేం. అమెరికాలో ఓ వ్యక్తికి ఇలానే అదృష్టం వచ్చి కోట్లు కుమ్మరించింది. అయితే, ఆ అదృష్టవంతుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మెగా మిలియన్స్ అనే సంస్థ నిర్వహించిన లాటరీలో రెండు డాలర్లు పెట్టి టికెట్ కొన్న ఓ వ్యక్తికి ఏకంగా 1.28 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 10,136 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

బహుమతి పొందిన టికెట్ వివరాలను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ టికెట్ అమ్ముడైనట్టు మెగా మిలియన్స్ తెలిపింది. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రభుత్వ ఆధర్యంలో నిర్వహించే ఈ లాటరీలో 2015 నుంచి జరిగిన 29 డ్రాలలో ఒక్కరికి కూడా జాక్‌పాట్ బహుమతి లభించలేదు. 

తాజాగా ఓ వ్యక్తిని ఆ అదృష్టం వరించింది. అంతేకాదు, అమెరికాలో గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద జాక్‌పాట్ కావడం గమనార్హం. మొత్తంగా ఆ దేశ చరిత్రలో మూడో అతిపెద్ద జాక్‌పాట్. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

More Telugu News