Rahul Gandhi: గుజరాత్ లో ఈ మాఫియాలను రక్షిస్తున్న రాజకీయ శక్తులు ఎవరు?: రాహుల్ గాంధీ

  • కల్తీ మద్యం తాగి గుజరాత్ లో 42 మంది మృతి
  • అక్రమ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయన్న రాహుల్
  • ఈ విష వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరని ప్రశ్నించిన రాహుల్
Who is behind liquor and drugs mafia in Gujarat asks Rahul Gandhi

గుజరాత్ లోని బోటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఈ నెల 25న కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోయారు. మరో 97 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ లో అక్రమ మద్యం, డ్రగ్స్ మాఫియా దందాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాఫియాలను అధికారంలో ఉన్న ఏ శక్తులు రక్షిస్తున్నాయని ప్రశ్నించారు. 

అక్రమ మద్యం వల్ల గుజరాత్ లో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. బిలియన్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయని చెప్పారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు పుట్టిన గడ్డపై ఈ విష వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు. వీరిని కాపాడుతున్న రాజకీయ శక్తులు ఎవరని అడిగారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

More Telugu News