Sukumar: ఎన్టీఆర్ 'పెద్ది' కథపై కూడా అక్కడే కసరత్తు!

  • ఎన్టీఆర్ తో 'పెద్ది' ప్లాన్ చేసిన బుచ్చిబాబు
  • సెకండాఫ్ పట్ల ఎన్టీఆర్ అసంతృప్తి 
  • సుకుమార్ సూచనలు తీసుకుంటున్న బుచ్చిబాబు 
  • అదే సమయంలో 'పుష్ప 2' చర్చల్లోనూ భాగమైన దర్శకుడు
Ntr in Buchhi Babu movie

ఎన్టీఆర్ కీ .. సుకుమార్ కి మధ్య 'నాన్నకు ప్రేమతో' సినిమా నుంచి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సుకుమార్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఆయన శిష్యుడైన బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడని అంటారు. బుచ్చిబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా సెకండాఫ్ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తికరంగా లేరనేది సమాచారం. 

అందువల్లనే 'పెద్ది' సెకండాఫ్ విషయాన్ని కూడా కాస్త చూడమని సుకుమార్ కి ఎన్టీఆర్ చెప్పాడని అంటున్నారు. ఈ కారణంగానే 'పుష్ప 2' పనుల్లో ఉన్న సుకుమార్ ను బుచ్చిబాబు కలిశాడని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన  ఫొటోలు వైరల్ అవుతుండటంతో, 'పుష్ప 2' కోసం సుకుమార్ పిలిపించాడనే ప్రచారం జరుగుతోంది.  

అయితే అందులో కొంత నిజం లేకపోలేదు. ఒక వైపున 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు భాగమవుతూనే, మరో వైపున 'పెద్ది' సెకండాఫ్ విషయంలో సుకుమార్ సూచనలను తీసుకుంటున్నాడని అంటున్నారు. మొత్తానికి సుకుమార్ అటు 'పుష్ప 2' ను .. ఇటు 'పెద్ది'ని ఒకేసారి సెట్ చేసే పనిలో ఉన్నాడన్నమాట.

More Telugu News