Sajjala Ramakrishna Reddy: అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచితే బాగుండేది: సజ్జల రామకృష్ణారెడ్డి

  • రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగిందన్న సజ్జల
  • విభజన హామీలు అమలు కాకపోవడం మరింత అన్యాయమని వ్యాఖ్య
  • కేంద్రంపై తాము ఒత్తిడి మాత్రమే చేయగలమన్న సజ్జల
We can only put pressure on Sajjala Ramakrishna Reddy

2026 వరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ స్థానాలను పెంచితే బాగుండేదని చెప్పారు. రాష్ట్ర విభజనే చాలా అన్యాయంగా జరిగిందని అన్నారు. విభజన హామీలు అమలు కాకపోవడం మరింత అన్యాయమని చెప్పారు. 

విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ అంశాలు కీలకమని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం పాలనకు సంబంధించినదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై తాము కేవలం ఒత్తిడి మాత్రమే చేయగలమని వ్యాఖ్యానించారు. మరోవైపు, 2026 వరకు అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని కేంద్రం ప్రకటించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో అసహనం వ్యక్తమవుతోంది.

More Telugu News