Telangana: సింగ‌రేణిలో అప్రెంటీస్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

  • 1,300 అప్రెంటీస్ ఉద్యోగాల భ‌ర్తీ
  • ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు
  • మిగిలిన 5 శాతం నాన్ లోక‌ల్‌కు కేటాయింపు
  • జులై 25 నుంచే పేర్ల న‌మోదు ప్ర‌క్రియ ప్రారంభం
  • ఆగ‌స్టు 8తో ముగియ‌నున్న గ‌డువు 
ts government issues notification to fill up 1300 apprentice posts in singareni colleries

తెలంగాణ నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ స‌ర్కారు మంగ‌ళ‌వారం మ‌రో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని సింగ‌రేణి కాల‌రీస్‌లో అప్రెంటీస్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. సింగ‌రేణిలో 1,300 అప్రెంటీస్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స‌ద‌రు నోటిఫికేష‌న్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 

అంతేకాకుండా ఈ ఉద్యోగాల భ‌ర్తీలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాల‌ను కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మిగిలిన‌ 5 శాతం ఉద్యోగాల‌ను నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు కేటాయిస్తున్న‌ట్లు పేర్కొంది.  

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ముందుగా ప్ర‌భుత్వ ఎన్ఏపీఎస్ పోర్ట‌ల్ అయిన అప్రెంటిస్‌షిప్ఇండియా వెబ్ సైట్‌లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్న త‌ర్వాత సింగ‌రేణి కాల‌రీస్‌(ఎస్‌సీసీఎల్‌)లో అప్రెంటిస్‌షిప్ శిక్ష‌ణ కొర‌కు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సూచించింది. జులై 25 నుంచి పేర్ల న‌మోదు ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. ఈ గ‌డువు ఆగ‌స్టు 8తో ముగుస్తుంద‌ని వెల్ల‌డించింది.

More Telugu News