Andhra Pradesh: ఏపీలో బార్ల మ‌ద్యం పాల‌సీపై స్టేకు హైకోర్టు నిరాక‌ర‌ణ‌

  • బార్ల కేటాయింపున‌కు జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • జీవోను స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌
  • త‌దుప‌రి విచార‌ణ‌ ఆగ‌స్టు 10కి వాయిదా 
  • కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశం
ap high court rejects to stay on ap government order on liquor policy

ఏపీలో బార్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన బార్ల మ‌ద్యం పాల‌సీపై స్టే విధించాలంటూ కొంద‌రు వ్య‌క్తులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు బార్ల మ‌ద్యం పాల‌సీపై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఈ మేర‌కు పిటిష‌నర్లు కోరిన మేర‌కు బార్ల మద్యం పాల‌సీని నిలిపివేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు హైకోర్టు ధ‌ర్మాస‌నం అంగీక‌రించ‌లేదు.

విచార‌ణ సంద‌ర్భంగా బార్ల మ‌ద్యం పాల‌సీలోని ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించిన పిటిష‌నర్లు... వేలంలో పాల్గొనే వ్యాపారులు... త‌మ‌కు బార్లు ద‌క్క‌క‌పోతే వారు క‌ట్టిన సొమ్మును న‌ష్ట‌పోతార‌ని వాదించారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఆగ‌స్టు 10కి వాయిదా వేసిన హైకోర్టు... కౌంట‌ర్‌ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News