Ashneer Grover: స్విగ్గీలో కలిపేస్తే జొమాటో షేరు పది రెట్లు పెరుగుతుంది: అష్నీర్ గ్రోవర్

  • రూ.450కు చేరుతుందన్న గ్రోవర్
  • రూ.43 స్థాయికి పడిపోయిన షేరు
  • బ్లింకిట్ వ్యవస్థాపకుడు కూడా ఆయనే
Zomato shares would be Rs 450 Ashneer Grover on food apps stocks slump

జొమాటో షేరు పతనంతో నిరాశ చెందిన ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చే మాటలు చెప్పారు భారత్ పే సహ వ్యవస్థాపకుడైన అష్నీర్ గ్రోవర్. జొమాటో షేరు ప్రస్తుతం రూ.43 స్థాయికి పడిపోయింది. దీంతో ట్విట్టర్లో గ్రోవర్ ఓ ట్వీట్ పెట్టారు. 

జొమాటో వెళ్లి స్విగ్గీలో విలీనం అయితే షేరు ధర 10 రెట్లు పెరిగి రూ.450 చేరుతుందని జోస్యం చెప్పారు. బ్లింకిట్ ను విలీనం చేసుకోవాలని జొమాటో ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రతికూలంగా మార్కెట్ వర్గాలు పరిగణిస్తున్నాయి. దీనివల్ల జొమాటో నష్టాలు మరింత పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో షేరుకు అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా షేరు ధర క్షీణిస్తోంది. బ్లింకిట్ పూర్వపు పేరు గ్రోఫర్స్. ఈ కంపెనీని అష్నీర్ గ్రోవర్ 2015లో స్థాపించారు.

More Telugu News