Kalyanram: బాబాయ్ సినిమాతోనే నా జర్నీ మొదలైంది: కల్యాణ్ రామ్

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ 
  • ప్రమోషన్స్ లో బిజీగా కల్యాణ్ రామ్ 
  • బాబాయ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చానంటూ వెల్లడి   
Kalyanram Interview

కల్యాణ్ రామ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో 'బింబిసార' సినిమా రూపొందింది. చారిత్రక నేపథ్యాన్ని సైన్స్ ఫిక్షన్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సినిమా ఇది. ఆగస్టు 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో తన జర్నీకి సంబంధించిన ఒక వీడియోను కల్యాణ్ రామ్ "అప్ క్లోజ్ విత్ ఎన్కే ఆర్' టైటిల్ తో వదిలాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. మా బాబాయి మా ఇంటికి వచ్చి, తాను చేస్తున్న 'బాల గోపాలుడు' సినిమాను గురించి నాన్నగారి దగ్గర ప్రస్తావించారు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి ఉందనీ, ఆ పాత్రను నాతో చేయించాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఆ విషయంలో నాన్నగారిని ఒప్పించారు. 

అలా 'బాల గోపాలుడు' సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. 'అతనొక్కడే' సినిమాతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, 'ఓం' వంటి ప్రయోగాలు చేశాను. ఆ సినిమా చాలా నిరాశపరిచింది. అయినా మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ముందుకు వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News