Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 306 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 88 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతం వరకు నష్టపోయిన మహీంద్రా అండ్ మహీంద్రా
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. గత వారమంతా లాభాల్లో కొనసాగిన మార్కెట్లు... ఆరు రోజుల వరుస లాభాలకు ముగింపు పలికాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 306 పాయింట్లు నష్టపోయి 55,766కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 16,631 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.10%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.80%), ఏసియన్ పెయింట్స్ (1.25%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.96%), విప్రో (0.93%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.80%), రిలయన్స్ (-3.31%), మారుతి (-2.33%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.66%), టెక్ మహీంద్రా (-1.35%).

More Telugu News