Draupadi Murmu: రాష్ట్రపతిగా కాసేపట్లో ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతల స్వీకారం.. ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీ రమణ!

  • కాసేపట్లో పార్లమెంటుకు చేరుకోనున్న కోవింద్, ద్రౌపది ముర్ము
  • ఉదయం రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళి అర్పించిన ముర్ము
  • చిన్న వయసులో అత్యున్నత పదవిని చేపట్టబోతున్న ద్రౌపది ముర్ము
Droupadi Murmu To Take Oath as President of India Today

భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి 21 ఫిరంగులతో గన్ శాల్యూట్ స్వీకరిస్తారు. ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఈ ఉదయం రాజ్ ఘాట్ లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధిని దర్శించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించారు. 

కాసేపట్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాబోయే రాష్ట్రపతి ముర్ము ఇద్దరూ పార్లమెంటుకు విచ్చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, భారత త్రివిధ దళాల అధినేతలు తదితరులు హాజరుకానున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పదవిని చేపట్టబోతున్న రెండో మహిళగా చరిత్రపుటల్లోకి ఎక్కారు. అంతే కాదు, చిన్న వయసులోనే ఈ పదవిని చేపట్టబోతున్న వ్యక్తిగా మరో ఘనతను సాధించారు.

More Telugu News