London: అంత గట్టి ఉక్కు బ్రిడ్జికి పట్టీలు కట్టారు.. ఎందుకంటే..!

  • యూరప్ లో మండిపోతున్న ఎండలతో జన జీవనం అతలాకుతలం
  • రోడ్లపై తారు కరిగి అంటుకుపోతున్న తీరు
  • ఉక్కుతాళ్లతో కూడిన చారిత్రాత్మక హ్యామర్ స్మిత్ బ్రిడ్జికీ సమస్య
  • విపరీతంగా వేడక్కి దెబ్బతినకుండా టిన్ ఫాయిల్ (తగరపు రేకులు) చుట్టి రక్షణ
No matter how hard this steel bridge is Do you know why

భానుడు ప్రతాపం చూపితే ఎవరైనా అల్లాడిపోవాల్సిందే. ఇప్పుడు యూరప్ లో కనిపిస్తున్న పరిస్థితి ఇదే. ప్రస్తుతం భూమి ఉత్తర భాగంలోని యూరప్ లో ఎండాకాలం. భారీ ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో యూరప్ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఎండ వేడికి రోడ్లపై తారు కరిగి వాహనాల టైర్లకు అంటుకుపోతోంది. ఇళ్లలోంచి బయటికి రావడానికి జనం జంకుతున్నారు. ఈ వేడి పరిస్థితి లండన్‌లోని ప్రఖ్యాత హ్యామర్‌ స్మిత్‌ బ్రిడ్జికీ తగిలింది.

పర్యాటక ప్రాధాన్యత ఉన్న బ్రిడ్జి

  • ఎప్పుడో 135 ఏళ్ల కిందట కట్టిన హ్యామర్ స్మిత్ బ్రిడ్జి లండన్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. బలమైన ఉక్కు తాళ్ల సపోర్టుతో నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటివరకు చెక్కు చెదరలేదు.
  • కానీ ఇటీవలి కాలంలో మండుతున్న ఎండలు, ఉష్ణోగ్రతలు ఈ బ్రిడ్జిని భయపెడుతున్నాయి. బ్రిడ్జికి ఆధారంగా ఉన్న ఉక్కు తాళ్లు విపరీతంగా వేడెక్కి సన్నగా పగుళ్లు వస్తున్నట్టు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు.. బ్రిడ్జికి ఉన్న ఉక్కు తాళ్లు, ఉక్కు ఆధారాలకు ఇలా టిన్ ఫాయిల్ (సన్నని తగరపు రేకు)ను పట్టీలా కట్టి పెట్టారు. 
  • దీనివల్ల ఉక్కు తాళ్లపై పడే ఎండ పరావర్తనం చెందుతుందని.. అవి విపరీతంగా వేడెక్కిపోకుండా ఉంటుందని లండన్ అధికారులు చెబుతున్నారు.
  • రెండేళ్ల కిందట కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఉక్కు తాళ్లు వేడెక్కి.. అతి సన్నని పగుళ్లు కనిపించాయని, అందుకే ఈసారి మరింత జాగ్రత్త చర్యలు చేపట్టామని అంటున్నారు.

More Telugu News