Allu Arjun: 'పుష్ప 3' కూడా ఉందట!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప' 
  • వచ్చేనెల నుంచి సెకండ్ పార్టు షూటింగ్ మొదలు
  • కీలకమైన పాత్రలో మనోజ్ బాజ్ పాయ్  
  • మూడో పార్టు కూడా ఉందన్న ఫహాద్ 
Pushpa 2 movie update

బన్నీ .. రష్మిక జంటగా సుకుమార్ రూపొందించిన 'పుష్ప' విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. హిందీలోనూ ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పై కసరత్తు పూర్తయిందని అంటున్నారు.

ఆగస్టు 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. 'పుష్ప 2' కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ ను కూడా తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 3' కూడా ఉండనుందనే విషయం బయటికి వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. 

సుకుమార్ ముందుగా ఈ కథను వెబ్ సిరీస్ గా చేయాలనుకున్నారు. బన్నీకి ఈ కథ తెలిసిన తరువాత అది సినిమాగా మారింది. మూడు గంటల్లో ఈ కథను చెప్పడం కుదరలేదు. ఈ సినిమాకి సెకండ్ పార్టు మాత్రమే కాదు .. మూడవ పార్టు కూడా ఉంది. మూడవపార్టుకి కూడా సిద్ధంగా ఉండమని సుకుమార్ గారు నాతో చెప్పారు" అని ఆ ఇంటర్వ్యూలో ఫహాద్ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.

More Telugu News