Seethakka: పొరపాటున బ్యాలెట్ పేపర్ పై పెన్ను గీత పడింది.. వేరే బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదు: సీతక్క వివరణ

  • బ్యాలెట్ పేపర్ పై భాగంలో పొరపాటున మార్కర్ గీత పడిందన్న సీతక్క
  • వేరే బ్యాలెట్  పేపర్ అడిగితే అధికారులు ఇవ్వలేదని వెల్లడి
  • ఆత్మ సాక్షిగా వేయాల్సిన వారికే ఓటు వేశానని వ్యాఖ్య
Seethakka vote in President elections

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారనే వార్త కలకలం రేపింది. విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా పొరపాటున ఆమె ముర్ముకు ఓటేశారంటూ జరిగిన ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీతక్క క్లారిటీ ఇచ్చారు. 

తాను పెన్ను (మార్కర్) తీస్తుంటే పొరపాటున బ్యాలెట్ పేపర్ పైభాగం అంచు మీద గీత పడిందని ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. వేరే బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అధికారులను తాను కోరానని... కానీ వారు ఇవ్వలేదని చెప్పారు. 

ఇక ఆత్మ సాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని... అయితే, ఆ గీత వల్ల ఏదైనా సమస్య ఉంటుందేమోనని, ఓటు చెల్లకుండా పోతుందేమోననే అనుమానంతో ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఓటు చెల్లుతుందో, చెల్లదో తనకు తెలియదని, ఆ విషయాన్ని అధికారులనే అడగాలని చెప్పారు.

More Telugu News