India: ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 16,935 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారు 16,069 మంది 
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,44,264
Corona cases in India slightly decreased

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2.61 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 16,935 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 16,069 మంది కరోనా నుంచి కోలుకోగా... 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలలో కేరళ నుంచే 29 రావడం గమనార్హం. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,44,264కి పెరిగింది. 

ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.48 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,00,04,61,095 డోసుల కరోనా వ్యాక్సిన్ వేయగా... నిన్న ఒక్కరోజే 4,46,671 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు టెస్టింగ్ లు తక్కువ కావడం వల్లే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించిందని అంటున్నారు.

More Telugu News