Monkeypox Virus: విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ కాదు... చర్మంపై మామూలు దద్దుర్లేనని తేల్చిన వైద్యులు

  • దుబాయ్ నుంచి విజయవాడ వచ్చిన చిన్నారి కుటుంబం
  • చిన్నారిలో మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు
  • శాంపిల్స్ పుణే ల్యాబ్ కు పంపిన అధికారులు
  • నెగెటివ్ వచ్చిన వైనం
No Monkeypox to Vijayawada toddler

దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. 

అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్ గా వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ కాదని వైద్యులు నిర్ధారించారు.  ఆ బాలికకు చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్ట్ కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ వెల్లడించారు.

More Telugu News