India: వరుసగా మూడో రోజు 20 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. పెరిగిన మృతుల సంఖ్య

  • గత 24 గంటల్లో 20,044 పాజిటివ్ కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 56 మంది మృతి 
  • లక్షన్నరకు చేరువవుతున్న యాక్టివ్ కేసులు
India reports 20044 fresh cases

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,301 మంది కోలుకోగా... 56 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,760కి పెరిగింది. 

ఇప్పటి వరకు దేశంలో 4,37,30,071 కేసులు నమోదయ్యాయి. 4,30,63,651 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,660 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.80 శాతంగా, క్రియాశీల రేటు 0.32 శాతంగా, రికవరీ రేటు 98 .48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,99,71,61,438 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 22,93,627 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

More Telugu News