Sensex: స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్!

  • 345 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 111 పాయింట్లు లాభపడ్ద నిఫ్టీ
  • 3 శాతం వరకు పెరిగిన హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ విలువ
Markets ends in profits

వరుసగా నాలుగు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభపడ్డాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నానికి నష్టాల్లో జారుకున్నాయి. ఆయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడి 53,760కి పెరిగింది. నిఫ్టీ 111 పాయింట్లు ఎగబాకి 16,049 పాయింట్ల వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.87%), టైటాన్ (2.84%), మారుతి (2.55%), ఎల్ అండ్ టీ (2.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.19%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.28%), విప్రో (-1.93%), డాక్టర్ రెడ్డీస్ (-0.84%).

More Telugu News