Charan: భారీ యాక్షన్ సీన్ కి రెడీ అవుతున్న చరణ్!

  • శంకర్ సినిమాతో బిజీగా చరణ్ 
  • కెరియర్ పరంగా ఆయనకిది 15వ సినిమా 
  • కథానాయికగా కియారా అద్వాని 
  • వచ్చే వేసవిలో సినిమా విడుదల చేసే ఛాన్స్ 
shankar and Charan movie update

చరణ్ ఇప్పుడు తన 15వ సినిమాకి సంబంధించిన షూటింగులో ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారు.
 
ఇప్పుడు అక్కడ 8వ షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి కియారా కూడా వచ్చేసింది. ఇక్కడ భారీ యాక్షన్ సీన్ ఒకటి ప్లాన్ చేశారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని అంటున్నారు. 

ఇంతవరకూ తన సినిమాలో చూడని ఒక ఫైట్ ను శంకర్ ఈ సినిమాలో చూపించనున్నాడని చెబుతున్నారు. ఈ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వేసవిలో విడుదల చేయనున్నారు.

More Telugu News