New Delhi: ఎనిమిదేళ్లలో 14సార్లు బలవంతపు అబార్షన్లు చేయించిన ప్రియుడు.. మహిళ ఆత్మహత్య

  • దేశ రాజధాని ఢిల్లీలో ఘటన
  • భర్త నుంచి 8-9 ఏళ్లుగా దూరంగా ఉంటున్న బాధితురాలు
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం
  • అబార్షన్లతో విసిగిపోయి ఆత్మహత్య
Woman commits suicide after being forced to undergo abortion

ఎనిమిదేళ్ల సహజీవనంలో 14 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించడంతో మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని జైట్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఆత్మహత్యకు ముందు ఆమె హిందీలో రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ప్రకారం.. 33 ఏళ్ల బాధిత మహిళ 9 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. బీహార్‌కు చెందిన గౌతమ్ ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం ప్రారంభించారు.

ఈ క్రమంలో ఈ 8 సంవత్సరాల్లో 14 సార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. అయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు ఈ నెల 5న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌతమ్ చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించానని, తన ఫోన్‌ను చెక్ చేయాలని కోరింది. 

నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బాధితురాలి భర్తను పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. తామిద్దరం దాదాపు 8 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నట్టు ఆయన చెప్పాడని పోలీసులు తెలిపారు.

More Telugu News