KA Paul: ఎన్నికల సర్వే సంస్థపై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాం: కేఏ పాల్

  • ఆరా మస్తాన్ సర్వేలతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు
  • తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉంది
  • బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్
KA Paul comments on election survey

ఎన్నికల సర్వే పేరుతో 'ఆరా' సంస్థ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. ఆ సంస్థ అధినేత మస్తాన్ పై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్పారు. ఆరా మస్తాన్ పిచ్చిపిచ్చి సర్వేలు చేస్తే ప్రజలు ఊళ్లలో తిరగనివ్వరని పాల్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీకి 30 శాతం ఓట్లు వస్తాయని మస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పిన కేఏ పాల్... మస్తాన్ సర్వే రిపోర్ట్ చించేశారు.  

దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్పారు. హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన సమావేశాలకు రూ. 2 వేల కోట్ల మేర ఖర్చు చేశారని తెలిపారు. ప్రధాని మోదీని బండి సంజయ్ దేవుడని అనడం సరికాదని అన్నారు. కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు చాలా విచిత్రంగా ఉంటున్నాయని చెప్పారు. రాజకీయ నాయకులకు జడ్జీలు భయపడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జికి రాజ్యసభ పదవి ఇచ్చారని విమర్శించారు.

More Telugu News