Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 508 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 157 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.33 పాయింట్లు నష్టపోయిన ఇన్ఫోసిస్ షేర్ విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. నష్టాలను వరుసగా రెండో రోజు కూడా కొనసాగించాయి. ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటా విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో, ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. 

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయి 53,886కి పడిపోయింది. నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 16,058కి దిగజారింది. ఈరోజు టెలికాం, యుటిలిటీస్, పవర్, రియాల్టీ సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (1.87%), భారతి ఎయిర్ టెల్ (0.33%), బజాజ్ ఫైనాన్స్ (0.21%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.33%), నెస్లే ఇండియా (-1.87%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.66%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.64%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.63%).

More Telugu News