Prawn: ఏలూరు జిల్లాలో వ్యక్తి ముక్కులో ఇరుక్కుపోయిన రొయ్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • గణపవరంలో ఒక వ్యక్తికి చుక్కలు చూపించిన రొయ్య
  • రొయ్యలు పడుతుండగా ముక్కులో చిక్కుకుపోయిన రొయ్య
  • ఎండోస్కోపీ నిర్వహించి రొయ్యను బయటకు తీసిన భీమవరం వైద్యులు
Prawn stuck in mans nose in Eluru district

రొయ్యే కదా అని లైట్ గా తీసుకుంటే... అది 'రొయ్యో మొర్రో' అనేలా చుక్కలు చూపిస్తుంది. ఏపీలోని ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి ఇలాంటి ఉక్కిరిబిక్కిరి ఘటనే ఎదురయింది. వివరాల్లోకి వెళ్తే, గణపవరంకు చెందిన ఒక వ్యక్తి రొయ్యలు పడుతుండగా... ఒక రొయ్య పైకి ఎగిరింది. అది నేరుగా అతని ముక్కులో చిక్కుకుపోయింది. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 

మరోవైపు ఊపిరి ఆడక ఆ వ్యక్తి తీవ్ర భయానికి గురయ్యాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న అతని బంధువులు... అతన్ని వెంటనే భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు సదరు బాధితుడికి ఎండోస్కోపీ నిర్వహించి రొయ్య పరిస్థితిని అంచనా వేశారు. ఆ తర్వాత నెమ్మదిగా రొయ్యను తొలగించారు. దీంతో, బాధితుడు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, చేపలు, రొయ్యలు పట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

More Telugu News