Delhi BJP: బీజేపీ ఢిల్లీ మహిళా అధికార ప్రతినిధికి లైంగిక వేధింపులు.. ఎఫ్ఐఆర్ నమోదు!

  • వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు
  • గత రెండు, మూడు నెలలుగా వేధింపులు
  • సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
Sexual harassment to Delhi BJP woman spokes person

ఢిల్లీ బీజేపీ మహిళా అధికార ప్రతినిధిని సోషల్ మీడియాలో లైంగికంగా వేధించిన గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ మహిళా ప్రతినిధిని ఒక తప్పుడు వీడియో ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని, వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఢిల్లీ బీజేపీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె గౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, పబ్లిక్ గా ఆమె పరువు తీసేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ క్రమంలో సెక్షన్ 354ఏ (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (మహిళ గౌరవాన్ని దెబ్బతీయడం), ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67 (అభ్యంతరకరమైన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమంలో షేర్ చేయడం) తదితర సెక్షన్లపై సైబర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత రెండు, మూడు నెలలుగా కొందరు వ్యక్తులు ఆమెను వేధిస్తున్నట్టు సమాచారం.

More Telugu News