Team India: ఫామ్​లోకి రాకుంటే టీ20 జట్టులో విరాట్​ కోహ్లీ చోటు గల్లంతేనా!

  • కొంతకాలంగా తీవ్రంగా నిరాశ పరుస్తున్న విరాట్
  • కుర్రాళ్ల నుంచి జట్టులో తీవ్ర పోటీ
  • నేడు ఇంగ్లండ్ తో భారత్ రెండో టీ20 మ్యాచ్ లో కోహ్లీపైనే ఫోకస్ 
Virat Kohli in focus as India eye unbeatable lead vs England

అన్ని ఫార్మాట్లలో పేలవ ఫామ్ కనబరుస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితుల్లో తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్న కోహ్లీ నేడు ఇంగ్లండ్ తో జరిగే రెండో మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. విరాట్ దాదాపు ఐదు నెలల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి తిరిగొస్తున్నాడు.

దాంతో, అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. టీ 20 ప్రపంచ కప్ అనంతరం భారత కెప్టెన్సీ పదులుకున్న విరాట్ తన చివరి అంతర్జాతయీ టీ20 ఈ ఫిబ్రవరిలో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో బరిలోకి దిగినప్పటికీ అక్కడ కూడా నిరాశ పరిచాడు. తర్వాత వన్డే జట్టు నాయకత్వం వదులుకున్న విరాట్ ను టెస్టు కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. రోహిత్ శర్మకు అన్ని జట్ల పగ్గాలు అప్పగించింది. 

నాయకత్వ భారం తొలిగిపోయినప్పటికీ కోహ్లీ బ్యాటింగ్ లో నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అదే సమయంలో టీమిండియా రొటేషన్ పాలసీ పాలసీ ప్రకారం కోహ్లీతోపాటు ఇతర సీనియర్లకు తరచుగా విరామం లభిస్తోంది. వీళ్ల స్థానాల్లో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా వంటి ఆటగాళ్లు అవకాశాలను అందుకున్నారు. దాంతో, కుర్రాళ్ల నుంచి సీనియర్లకు పోటీ ఎక్కువైంది.

విరాట్ ఆడే మూడో నంబర్ లో వచ్చి ఇంగ్లండ్ తో తొలి టీ20తో హుడా ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్ లోనూ అతడిని తుది జట్టులో కొనసాగిస్తే రోహిత్ తో కలిసి కోహ్లీ ఓపెనర్ గా వచ్చే చాన్సుంది. ఈ సిరీస్ తర్వాత వెస్టిండీస్ తో ఐదు టీ20ల సిరీస్ లో ఆడకుండా విరాట్ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లండ్ తో చివరి రెండు మ్యాచ్ ల్లో రాణిస్తేనే కోహ్లీ జట్టులో చోటు నిలుపుకుంటాడన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

More Telugu News