Telangana: వచ్చే నెలలో రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం: తెలంగాణ ప్రభుత్వం

  • ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోల చొప్పున కేంద్రం బియ్యం పంపిణీ
  • జనవరి నుంచి సెప్టెంబరు వరకు కూడా ఈ పథకం కింద ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామన్న కేంద్రం 
  • మే నెలలో ఉచిత బియ్యం పంపిణీని ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
Telangna Govt decided to distribute 15 kg free rice ration card holders in august

రేషన్‌కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద కరోనా సంక్షోభం నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 

పలుమార్లు ఈ పథకాన్ని పొడిగించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు కూడా ఈ పథకం కింద ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే నెలలో ఈ ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

More Telugu News