Galla Jayadev: ఫోర్బ్స్ లిస్టులో అమ‌ర‌రాజా!... 500 బెస్ట్ ఎంప్లాయ‌ర్స్ జాబితాలో చోటు!

  • టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఆధ్వ‌ర్యంలోనిదే అమ‌ర‌రాజా గ్రూప్‌
  • చిత్తూరు జిల్లా కేంద్రంగా సంస్థ కార్య‌క‌లాపాలు
  • త‌మ‌కు ద‌క్కిన గుర్తింపుపై అమ‌ర‌రాజా ఆస‌క్తిక‌ర ట్వీట్‌
amararaja group lists in Forbes 500 best employers list

టీడీపీ యువ నేత‌, గుంటూరు లోక్ స‌భ స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబ ఆధ్వ‌ర్యంలోని అమ‌ర‌రాజా గ్రూప్ స‌త్తా చాటింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకున్న ఈ కంపెనీ... 500 బెస్ట్ ఎంప్లాయ‌ర్స్ జాబితాలో నిలిచింది. ఈ మేర‌కు త‌న‌కు ద‌క్కిన గుర్తింపుపై అమ‌ర‌రాజా గ్రూప్ మంగ‌ళ‌వారం ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

జ‌నం విలువ తెలిస్తే పోటీలో ముందుంటామ‌న్న విష‌యాన్ని తాము నమ్ముతామ‌ని.. విశ్వాసం, గౌర‌వం అన్న‌వే ఆ నమ్మ‌కానికి కార‌ణ‌మ‌ని కూడా అమ‌ర‌రాజా గ్రూప్‌ తెలిపింది. ఆ దిశ‌గా ప‌య‌నించినందుకే తాము ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నామ‌ని వెల్ల‌డించింది. ఈ న‌మ్మ‌కంతోనే మ‌రింత వృద్ధిని సాధిస్తామ‌ని కూడా ఆ సంస్థ తెలిపింది.

More Telugu News