YSRCP: పెగాస‌స్‌పై భూమ‌న క‌మిటీ విచార‌ణ ప్రారంభం.. ఐటీ, హోం శాఖ‌, ఆర్టీజీఎస్ అధికారుల హాజ‌రు

  • టీడీపీ స‌ర్కారుపై పెగాస‌స్ ఆరోప‌ణ‌లు
  • విప‌క్ష నే‌త‌లపై నిఘా కోసం పెగాసస్ కొన్నార‌ని ఆరోప‌ణ‌లు
  • అసెంబ్లీ క‌మిటీకి విచార‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం
  • భూమన నేతృత్వంలో విచార‌ణ ప్రారంభించిన క‌మిటీ
house committee on pegasus starts its enquiry

పెగాస‌స్ నిఘా ప‌రిక‌రాలు కొనుగోలు చేసిన‌ట్లుగా టీడీపీ ప్ర‌భుత్వంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌భా సంఘాన్ని నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ క‌మిటీ మంగ‌ళ‌వారం త‌న విచార‌ణ‌ను ప్రారంభించింది. ఇప్ప‌టికే ఓ ద‌ఫా స‌మావేశ‌మైన ఈ క‌మిటీ... త‌మ‌కు అప్ప‌గించిన వ్య‌వ‌హారంపై స‌మ‌గ్రంగా చ‌ర్చించింది. జులై 5న విచారణ ప్రారంభించ‌నున్న‌ట్లు కూడా క‌మిటీ నాడే ప్ర‌క‌టించింది.

తాజాగా మంగ‌ళవారం అమ‌రావ‌తి ప‌రిధిలోని అసెంబ్లీలో భూమ‌న నేతృత్వంలోని క‌మిటీ పెగాసస్ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణకు రాష్ట్ర హోం శాఖ‌, ఐటీ శాఖ ఉన్న‌తాధికారుల‌తో పాటు ఆర్టీజీఎస్‌కు చెందిన అధికారులు కూడా హాజ‌ర‌య్యారు. పెగాస‌స్ సంస్థ‌కు చెందిన బృందం నాటి టీడీపీ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించిందా? ఆ భేటీలో ఎవ‌రేమ‌న్నారు? ఒప్పందం కుదిరిందా? కుదిరి ఉంటే దానికి సంబంధించిన ప‌త్రాలు.. లేదంటే ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలేమిటి? అన్న విష‌యాల‌పై ఈ క‌మిటీ అధికార‌ల‌ను ప్ర‌శ్నించ‌నుంది.

More Telugu News