Ram: దూసుకుపోతున్న 'ది వారియర్' ట్రైలర్!

  • రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ 
  • తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన సినిమా
  • ఈ నెల 14వ తేదీన రెండు భాషల్లోను విడుదల
The Warrior Movie Update

రామ్ - కృతి శెట్టి జంటగా దర్శకుడు లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను తెలుగు ..  తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

ఈ సినిమాకి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వదిలిన 'బుల్లెట్ ' .. 'విజిల్' పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి తెలుగు .. తమిళ ట్రైలర్స్ ను రిలీజ్ చేశారు. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఇంతవరకూ 16 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. 

ఈ సినిమాలో ఆది పినిశెట్టి  ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇక కీలకమైన పాత్రలో నదియా కనిపించనుంది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్న విషయం తెలిసిందే.

More Telugu News