Chiranjeevi: హుందాగా .. గంభీరంగా మెగాస్టార్: 'గాడ్ ఫాదర్' ఫస్టులుక్ రిలీజ్

  • 'గాడ్ ఫాదర్' గా చిరంజీవి
  • రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ  
  • మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ 
  • కీలకమైన పాత్రలో సల్మాన్ ఖాన్
  • దసరాకి సినిమా విడుదల
God Father movie  first look released

చిరంజీవి కథానాయకుడిగా ఎన్వీ ప్రసాద్ నిర్మాణంలో 'గాడ్ ఫాదర్' రూపొందింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆ మధ్య మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్'కి రీమేక్. తాజాగా ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఏదో సమస్య ఎదురైతే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచన చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో చిరంజీవి కనిపిస్తున్నారు. 
                          
చిరంజీవి వయసుకి తగిన పాత్ర ఇది .. కాకపోతే ఆయనను డిఫరెంట్ లుక్ తోనే చూపించనున్నారు. ఈ పోస్టర్లో ఆయన లుక్ హుందాగా .. గంభీరంగా కనిపిస్తోంది. మలయాళంలో మంజూ వారియర్ పోషించిన పాత్రలో తెలుగులో నయనతార నటించింది. ఆమె నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మరో ముఖ్యమైన పాత్రను సత్యదేవ్ పోషించాడు. ఇక ప్రత్యేకమైన పాత్రలో పూరి జగన్నాథ్ కనిపించనుండటం విశేషం. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, దసరా పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News