Upendra: మహేశ్ కోసం రంగంలోకి కన్నడ స్టార్ హీరో!

  • కన్నడలో సీనియర్ స్టార్ హీరోగా ఉపేంద్ర
  • టాలీవుడ్ నుంచి వెళుతున్న కీలక పాత్రలు
  • 'సన్నాఫ్ సత్యమూర్తి'లో గుర్తుండిపోయే పాత్ర 
  • త్రివిక్రమ్ మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా టాక్  
Trivikram and Mahesh Babu movie update

ఉపేంద్ర కన్నడలో సీనియర్ స్టార్ హీరోగా తన జోరును కొనసాగిస్తున్నారు. చాలాకాలం క్రితమే ఆయన తెలుగు సినిమాలు చేశారు. హీరోగా తెలుగులో ఆయన చేసిన సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులు చూసేవారు. ఇక ఈ మధ్య కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన తెలుగులో కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. 

అలాంటి ఉపేంద్రను మహేశ్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టుగా ఒక వార్త బలంగా వినిపిస్తోంది. మహేశ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఇక మహేశ్ తండ్రి పాత్ర కోసం ఉపేంద్రను ఎంచుకున్నారని అంటున్నారు.

ఈ పాత్ర చాలా కీలకమైనదిగా .. పవర్ఫుల్ గా ఉంటుందనీ, ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని అంటున్నారు. ఇంతకుముందు త్రివిక్రమ్ సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర పోషించిన దేవరాజ్ పాత్ర ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది .. ఆయనకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి మరి.

More Telugu News