President Of India Election: రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 115 నామినేష‌న్లు... బ‌రిలో మిగిలింది ఇద్దరు మాత్ర‌మే

  • 107 నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించిన అధికారులు
  • దాఖ‌లు స‌మ‌యంలోనే తిర‌స్క‌ర‌ణ‌కు గురైన 28 నామినేష‌న్లు
  • బ‌రిలో నిలిచింది ముర్ము, య‌శ్వంత్‌లు మాత్ర‌మే
murmu and yashwath are the candidates fro the president of india election

భార‌త రాష్ట్రప‌తి ఎంపిక కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల దాఖ‌లు, ప‌రిశీల‌న‌, ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు గ‌డువు శనివారంతో ముగిసింది. అంతిమంగా ఈ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు అభ్య‌ర్థులు మాత్ర‌మే బ‌రిలో నిలిచారు. వారిలో ఎన్డీఏ అభ్య‌ర్ధి ద్రౌప‌ది ముర్ము ఒకరు కాగా...విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా రెండో అభ్య‌ర్థి.

 రాష్ట్రప‌తి ఎన్నిక‌కు మొత్తంగా 94 మంది వ్యక్తుల నుంచి 115 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. అయితే వాటిలో 107 నామినేష‌న్లు స‌రైన ప‌త్రాల‌తో దాఖ‌లు కానందున ఎన్నిక‌ల సంఘం వాటిని తిర‌స్క‌రించింది. వీటిలో 26 మందికి చెందిన 28 నామినేష‌న్లు దాఖ‌లు స‌మ‌యంలోనే తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. మిగిలిన 79 నామినేష‌న్లు ఆయా అభ్య‌ర్థుల‌ను ప్ర‌తిపాదించిన వారితో పాటు బ‌ల‌ప‌రిచే స‌భ్యుల సంఖ్య స‌రిగా లేక‌పోవ‌డంతో తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. 

ఇక, ముర్ముతో పాటు య‌శ్వంత్ లు చెరో 4 సెట్ల చొప్పున నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. వీరిద్ద‌రికి చెందిన 8 నామినేష‌న్ల‌ను ప‌క్క‌న‌పెడితే... మిగిలిన అన్ని నామినేష‌న్లు కూడా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లే.

More Telugu News